అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరదల్లో బాపట్ల జిల్లా, దేవరపల్లికి చెందిన వెంకటేష్ అనే యువకుడి గల్లంతయ్యాడు. సిబ్బంది r. సహాయక చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. అక్కడ MS పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ వరదల్లో కొట్టుకుపోగా, అతని కారు, బ్యాగ్ గుర్తించారు.
అమెరికా పోలీసులు వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. కుమారుడి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.