AP: రాష్ట్రంలోని స్కూల్, ఇంటర్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆధార్ స్పెషల్ క్యాంపులను మరోసారి నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మొదటి విడత, 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండో విడత క్యాంపులు జరుగుతాయి. గతంలో నిర్వహించినా చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.