ఈ నెల 17 నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు ప్రారంభం (AP)

6659చూసినవారు
ఈ నెల 17 నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు ప్రారంభం (AP)
AP: రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఆధార్‌ అప్‌డేట్‌ ప్రత్యేక క్యాంపులు నవంబర్‌ 17 నుంచి 26 వరకు పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్‌ వివరాలు, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకునే సౌకర్యం ఈ క్యాంపుల్లో లభిస్తుందని అన్నారు. ఇంకా 15.46 లక్షల మంది పిల్లలు ఆధార్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉందని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్