ఆధార్ దుర్వినియోగం.. మీ వివరాలు ఎవరు వాడారో తెలుసుకోండి!

3541చూసినవారు
ఆధార్ దుర్వినియోగం.. మీ వివరాలు ఎవరు వాడారో తెలుసుకోండి!
ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఇతర పనులకు ఆధార్ తప్పనిసరిగా మారింది. దీంతో ఆధార్ కార్డుల దుర్వినియోగం కూడా పెరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు UIDAI ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీ ఆధార్‌ను ఎవరు, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మై ఆధార్ సెక్షన్‌లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ ఆధార్ నంబర్, క్యాప్చా, OTP ఎంటర్ చేయడం ద్వారా ఈ వివరాలను పొందవచ్చు. మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడితే, UIDAI హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, బయోమెట్రిక్ లాక్ చేసుకుంటే మీ ఆధార్‌ను ఇతరులు దుర్వినియోగం చేయలేరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్