mAadhaar స్థానంలో కొత్త ఆధార్ యాప్.. ఉచిత ఈమెయిల్ అప్‌డేట్ సౌకర్యం

7576చూసినవారు
mAadhaar స్థానంలో కొత్త ఆధార్ యాప్.. ఉచిత ఈమెయిల్ అప్‌డేట్ సౌకర్యం
భారతీయ ఆధార్ వినియోగదారుల కోసం UIDAI ఒక వినూత్న మార్పును తీసుకువచ్చింది. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న mAadhaar యాప్ స్థానంలో మరింత సురక్షితమైన, వేగవంతమైన 'ఆధార్ యాప్'ను ప్రవేశపెట్టింది. జులై 1 నుండి 6 నెలల పాటు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే యాప్ ద్వారా ఉచితంగా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని UIDAI అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్ చిరునామాను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఫేస్ ఆథెంటికేషన్, QR కోడ్ ఆధారిత సురక్షిత షేరింగ్, బయోమెట్రిక్ లాక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ యాప్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుగా కీలక పాత్ర పోషించనుంది.

సంబంధిత పోస్ట్