గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరకుండా నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో లక్నోతో తలపడనున్న ఢిల్లీ జట్టులో ఓపెనింగ్ జోడీ మారనుంది. కేఎల్ రాహుల్‌తో పాటు పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గతంలో ఢిల్లీకి ఆడిన పృథ్వీ షా, మినీ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయినా, చివరి నిమిషంలో రూ. 75 లక్షలకు ఢిల్లీ అతడిని సొంతం చేసుకుంది. ఆకాశ్ చోప్రా సూచించిన జట్టులో నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ, సమీర్ రిజ్వి/విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, టి.నటరాజన్/ఆకిబ్ నబీ ఉన్నారు.