జులై 5న ఆమిర్‌ఖాన్ 3వ వివాహం

16858చూసినవారు
జులై 5న ఆమిర్‌ఖాన్ 3వ వివాహం
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన మూడో వివాహాన్ని అధికారికంగా ధృవీకరించారు. తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను జులై 5వ తేదీన ముంబైలోని తన నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. గౌరీ స్ప్రాట్ బెంగళూరుకు చెందిన వెల్‌నెస్ రంగ నిపుణురాలు. గతంలో ఆమిర్ ఖాన్ రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. ఈ వివాహ వేడుకల్లో ఆమిర్ ఖాన్ పిల్లలతో పాటు గౌరీ స్ప్రాట్ కుమారుడు కూడా పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్