AP: మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తనపై
టీడీపీ ముద్ర ఉందని, తాను తటస్థుడినేనని ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ముందే నిర్ణయించుకున్నానని, టీడీపీలో చేరాలని ప్రయత్నించినా ఆశించిన స్పందన రాలేదని, అందుకే సొంతంగా రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నానని ఆయన వెల్లడించారు.