వేసవిలో తగ్గుముఖం పట్టిన ఏసీ అమ్మకాలు.. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి

7306చూసినవారు
వేసవిలో తగ్గుముఖం పట్టిన ఏసీ అమ్మకాలు.. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి
వేసవి ప్రారంభమైనా ఏసీల అమ్మకాలు ఊపందుకోలేదు. అకాల వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మార్కెట్‌లో కొనుగోలుదారులు తగ్గిపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి సీజన్‌లో ఏసీల డిమాండ్ సుమారు 30 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలు ముందుగానే సిద్ధం చేసుకున్న భారీ స్టాక్‌లు ఇప్పుడు డీలర్ల వద్ద పేరుకుపోయాయి. సుమారు 25 లక్షల యూనిట్ల వరకు నిల్వలు ఉండటం కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.

సంబంధిత పోస్ట్