వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఎయిర్ కండిషనర్ల (AC) వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా 1.5-టన్ స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు. 3-స్టార్ ఏసీ గంటకు 1.5-1.7 యూనిట్లు, 5-స్టార్ ఏసీ గంటకు 1.2 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తాయి. 5-స్టార్ ఏసీలు 3-స్టార్ ఏసీలతో పోలిస్తే దాదాపు 40-45 శాతం విద్యుత్ ఆదా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక స్టార్ రేటింగ్ ఉన్న మోడళ్లలో దీర్ఘకాలంలో ఖర్చులు తగ్గుతాయి.