AP: విజయవాడలో 13 ఏళ్ల లంచం కేసుకు తుది తీర్పు వెలువడింది. రూ.1500 లంచం తీసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) టి. శంకరరావుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించింది. 2013లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో బిల్లులు ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు శంకరరావు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది.