ఏపీ వ్యాప్తంగా 2వరోజు ఏసీబీ దాడులు కొనసాగాయి. విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు, డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్‌లైన్ లావాదేవీలు, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల తీరుపై ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ సోదాల కారణంగా రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడటంతో పాటు, రెండోరోజూ డాక్యుమెంట్ రైటర్ల ఆఫీసులు మూతబడ్డాయి.