ఏపీలో రెండో రోజు ఏసీబీ సోదాలు (వీడియో)

24చూసినవారు
APలో అవినీతి నిర్మూలన దిశగా ఏసీబీ చర్యలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 120 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, ప్రజల నుంచి అవినీతి ఫిర్యాదులు పెరగడంతో ఈ చర్యలు ప్రారంభించారు. బుధవారం ఎన్టీఆర్‌, ఏలూరు, కోనసీమ, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సోదాలు జరిగాయి. ఇప్పటివరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్