డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

16690చూసినవారు
డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో DSP భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నార్సింగిలోని వేసెల్లా మెడోస్‌లోని భీమ్‌రెడ్డి ఇల్లు సహా 20 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసిన భీమ్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. భీమ్‌రెడ్డి ప్రస్తుతం డీజీపీ ఆఫీస్​లోని కంప్యూటర్ సర్వీసెస్‌లో డీఎస్పీగా పని చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్