శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు (వీడియో)

8420చూసినవారు
AP: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శిఖరేశ్వరం తొలి మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి ప్రథమ చికిత్స తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.