పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ టెలిగ్రామ్ ద్వారా విస్తృతంగా సర్క్యూలేట్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఛానళ్లు, అక్రమ కంటెంట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని టెలిగ్రామ్‌కు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పైరసీని అరికట్టేందుకు అక్రమ ఛానళ్లను తొలగించడం, కాపీరైట్ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.