ద్వారకాతిరుమల మూలవిరాట్ వీడియో చిత్రీకరణపై చర్యలు

10చూసినవారు
AP: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి మూలవిరాట్ వీడియోను యూట్యూబర్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో త్రినాథరావు స్పందిస్తూ, డ్యూటీలో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఏఈఓ, సూపరింటెండెంట్, సెక్యూరిటీ సీఎస్ఓలకు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వీడియో తీసిన యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్