AP: MRP కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించినా, కల్తీ మద్యానికి పాల్పడితే రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. మద్యం షాపుల ప్రస్తుత లైసెన్సుల రెన్యువల్ ఫీజును 10 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెన్యువల్ కాని దుకాణాలను రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో లక్కీడ్రా ద్వారా కేటాయిస్తారు. 3,396 మద్యం షాపులు ఓపెన్ కేటగిరి, 340 షాపులు కల్లుగీత కార్మికులకు కేటాయించారు.