AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.