నటుడు మైఖేల్ పాట్రిక్ (35) కన్నుమూశారు. ప్రముఖ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో నటించిన ఆయన, మోటార్ న్యూరోన్ వ్యాధితో కొన్నేళ్లుగా పోరాడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయన భార్య నయోమీ షీహాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఉత్తర ఐర్లాండ్ హాస్పీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రశాంతంగా ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. మరణానికి ముందు చేసిన ఆయన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆసుపత్రి పరిస్థితులు, తన ఆరోగ్య పరిస్థితిపై భావోద్వేగంగా రాసిన ఆ పోస్టు అభిమానులను కలచివేస్తోంది.