నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు పూర్తి

29184చూసినవారు
ముంబైలో ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు, సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. ఇక సెలవు అంటూ తుది వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆయన వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కల్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. తెలుగులో ‘సై, ఛత్రపతి, భద్ర, గజిని, యోగి, లక్ష్మీ’ వంటి సినిమాల్లో తన నటనతో ప్రదీప్ రావత్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

సంబంధిత పోస్ట్