బాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలు రేకెత్తిస్తున్న చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న హీరో వరుణ్ ధావన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో తనకు గాయం అయినట్లు వరుణ్ వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. వరుణ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.