డ్రగ్స్ కేసు.. మీడియాపై నటి హేమ విమర్శలు

4971చూసినవారు
డ్రగ్స్ కేసు.. మీడియాపై నటి హేమ విమర్శలు
డ్రగ్స్ కేసులో తప్పుడు ప్రచారం జరిగిందని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పాజిటివ్ అని రాకుండానే వచ్చిందని ప్రచారం చేశారని, కర్ణాటక హైకోర్టు కేసు కొట్టివేసినా మీడియా తక్కువగా రాసిందని ఆమె తెలిపారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగానని, తనకూ కుటుంబం ఉందని, నిర్ధారణ అయ్యాకే వార్తలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి, ఈ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్