ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించిన డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, వెబ్‌సైట్ల నుంచి ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను తొలగించడానికి ఒక ఆచరణాత్మక విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది.