గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుము..సామాన్యులపై భారం తప్పదా?

3957చూసినవారు
గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుము..సామాన్యులపై భారం తప్పదా?
దేశంలో ఇంధన నిల్వలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు యోచిస్తోంది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కిలోకు రూ.1.29 రుసుము విధించాలని భావిస్తోంది. దీని ద్వారా ఏటా రూ.4375 కోట్ల ఆదాయం లభించనుంది. ఈ రుసుముతో గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.18 పెరిగే అవకాశం ఉంది. సీఎన్జీకి ప్రతి ఘనపు మీటరుకు రూ.1.43 సుంకం విధించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రాబోయే 10 ఏళ్లలో ఎల్పీజీ నిల్వలను పెంచేందుకు కేంద్రం భారీ ప్రణాళికలు రచిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్