మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ ఆదివాసీ రైతు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుని జాక్‌పాట్ కొట్టాడు. రాకేశ్ అనే రైతు ఈ ఏడాది ఏప్రిల్‌లో అహిర్‌గావ్ ప్రాంతంలో వజ్రాల వేట కోసం భూమిని లీజుకు తీసుకుని బంధువులతో కలిసి తవ్వకాలు చేపట్టాడు. రెండు నెలల తర్వాత 11.19 క్యారెట్ల విలువైన వజ్రం లభించింది. అధికారులు పరిశీలించగా దాని విలువ సుమారు రూ.30 లక్షలుగా అంచనా వేశారు. విశేషమేమిటంటే, రెండేళ్ల క్రితం ఇదే కుటుంబానికి రూ.93 లక్షల విలువైన మరో వజ్రం దొరకడం స్థానికంగా చర్చనీయాంశమైంది.