AP: తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు కూడా 8 గంటలు విచారించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద సిట్ తాత్కాలిక కార్యాలయంలో డీఐజీ మురళీ రాంబా, అధికార బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రొక్యూర్‌మెంట్ కమిటీ నిర్ణయంతో నెయ్యి కొన్నామని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు మౌనం వహించినట్లు సమాచారం.