కల్తీ నెయ్యి కేసు.. చిన్నఅప్పన్న విచారణలో కీలక విషయాలు

64చూసినవారు
కల్తీ నెయ్యి కేసు.. చిన్నఅప్పన్న విచారణలో కీలక విషయాలు
AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్నను అరెస్టు చేసి విచారించిన సిట్.. రిమాండ్ రుపోర్టులో కీలక విషయాలు తెలిపింది. 2022 టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించి, నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్‌ చేశారు. కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. అందుకు ఆ డెయిరీ యాజమాన్యం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆ డెయిరీపై అనర్హత వేటు వేసేలా తనిఖీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్