శ్రీశైలంలో శివయ్య ప్రసాదం సురక్షితమేనా? అన్న ప్రశ్నతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల తర్వాత శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న ప్రచారం రాజకీయంగా కలకలం రేపుతోంది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు రాజేశ్ కార్పొరేషన్ ద్వారా సుమారు 3.25 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెయ్యి భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యితో సంబంధముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో విజయ డెయిరీని పక్కన పెట్టడంపైనా సందేహాలు తలెత్తాయి. అధికారిక దర్యాప్తుతోనే నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.