జోగి రమేష్ అరెస్ట్‌తో వేడెక్కిన ఏపీ రాజకీయం

6చూసినవారు
జోగి రమేష్ అరెస్ట్‌తో వేడెక్కిన ఏపీ రాజకీయం
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హీటెక్కింది. జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఇది కక్ష సాధింపు చర్య అని అన్నారు. జోగి రమేష్ భార్య శకుంతల దేవి తన భర్త నిర్దోషి అని పేర్కొన్నారు. మరోవైపు TDP నేత బుద్ధా వెంకన్న, రమేష్ తయారు చేసింది స్లో పాయిజన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ ఘటనతో ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.