ఏపీలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రాజమహేంద్రవరంలో గత నెలలో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది. కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు (75), డెల్టా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి (55) పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఉండగా, వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.