ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

29201చూసినవారు
TG: నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామనికి చెందిన దాయిని ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సంధ్య, ప్రియుడు అనిల్‌ మరో వ్యక్తి వెంకటసాయి సాయంతో భర్త హత్యకు ప్లాన్ వేశారు. సంధ్య సూచన మేరకు ప్రశాంత్‌ను వెంకటసాయి ఇంటిపై నుంచి నెట్టేశాడు. అతను చనిపోకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అక్కడి నుంచి వచ్చాక సెలైన్లో టాయిలెట్ క్లీనర్ ఎక్కించి ప్రశాంత్‌ను హత్య చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా అసలు గుట్టు వీడింది.

సంబంధిత పోస్ట్