14 ఏళ్ల తర్వాత.. బంగ్లాదేశ్‌ నుంచి పాక్‌కు డైరెక్ట్‌ విమానం!

517చూసినవారు
14 ఏళ్ల తర్వాత.. బంగ్లాదేశ్‌ నుంచి పాక్‌కు డైరెక్ట్‌ విమానం!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్వదేశం వీడిన తర్వాత పాకిస్థాన్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ఇరు దేశాలూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, గురువారం సాయంత్రం ఢాకా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి నేరుగా విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. 2012 తర్వాత ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడవడం ఇదే తొలిసారి. ఈ సర్వీసు వారానికి రెండు సార్లు నడవనుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన బిమాన్ ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసులను నడపనుంది.

సంబంధిత పోస్ట్