'రాకా' తర్వాత ఎన్టీఆర్‌తో అట్లీ సినిమా?

10688చూసినవారు
'రాకా' తర్వాత ఎన్టీఆర్‌తో అట్లీ సినిమా?
అల్లు అర్జున్‌తో 'రాకా' సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు అట్లీ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 'రాకా' షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక 2028 ప్రారంభంలో కొత్త సినిమా ప్రారంభించే యోచనలో ఉన్న అట్లీ, 'జవాన్ 2' స్క్రిప్ట్ చర్చలు జరుపుతున్నారని, అలాగే కమల్ హాసన్, సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసేందుకు స్టోరీ లైన్ సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వార్తలు వచ్చినప్పటికీ, అట్లీ టీం వాటిని పుకార్లుగా కొట్టిపారేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్