ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్కు అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ చెల్లదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు, ట్రైబల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ చట్టంలో మార్పులు, బీచ్ షాక్స్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.