AP: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖలో ఆందోళన నిర్వహించారు. ద్వారకా బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. జీఎంవీసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలకు స్పందన లేకపోవడంతో రాస్తారోకోకు దిగినట్లు ఉద్యోగులు తెలిపారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కల్పించాలని, బకాయిలు చెల్లించాలని, జీవో 11ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.