సర్కారు బడి పిల్లలకు ఏఐ పాఠాలు.. డిగ్రీ విద్యార్థులే టీచర్లు

8080చూసినవారు
సర్కారు బడి పిల్లలకు ఏఐ పాఠాలు.. డిగ్రీ విద్యార్థులే టీచర్లు
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ‘అన్న.. అక్క మెంటార్‌షిప్’ పేరుతో టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. జులై నుంచి సెప్టెంబర్ 2026 మధ్య అమలు కానున్న ఈ కార్యక్రమంలో 39,828 మంది డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి పిల్లలకు డిజిటల్ లిటరసీ, ఏఐ ప్రాథమిక అంశాలు, మెషిన్ లెర్నింగ్ వంటివి నేర్పిస్తారు. విజయవంతంగా 30 గంటల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన కాలేజీ విద్యార్థులకు అకాడమిక్ క్రెడిట్ కేటాయించనున్నారు.

సంబంధిత పోస్ట్