భారతదేశంలో ఐటీ రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని ఎకనామిక్ సర్వే 2025-26 హెచ్చరించింది. అమెరికాలోని PBIS రంగాన్ని లీడ్ ఇండికేటర్‌గా ఉపయోగించి, AI టూల్స్ వాడకం పెరిగిన తర్వాత జీడీపీ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగాల వృద్ధి జరగడం లేదని సర్వే గుర్తించింది. ఇది సంప్రదాయ బ్యాక్-ఆఫీస్ మోడల్‌కు ముప్పు అని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం జోక్యం అవసరమని, AI ఎకనామిక్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది.