ఐటీ కంపెనీలకు AI టూల్స్ ముప్పు.. ఇన్ఫోసిస్, TCS స్టాక్స్ పతనం

4902చూసినవారు
ఐటీ కంపెనీలకు AI టూల్స్ ముప్పు.. ఇన్ఫోసిస్, TCS స్టాక్స్ పతనం
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వేగంగా మార్కెట్లోకి వస్తుండటంతో, దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీలు తమ మనుగడపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ తన క్లాడ్ (Claude) చాట్‌బాట్ కోసం ప్రవేశపెట్టిన కొత్త లీగల్ టూల్, లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను ఆటోమేట్ చేయగలగడంతో ఐటీ సేవల కంపెనీల మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని ప్రభావంతో వాల్‌స్ట్రీట్‌లో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, అడోబ్ వంటి టెక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లలో ఐటీ షేర్ల అమ్మకాలు భారతీయ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి వాటి షేర్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. బుధవారం నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతం పతనమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్