2026 సంవత్సరం టెక్ ప్రపంచానికి కష్టకాలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ కారణంగా
ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 1,58,000 మంది టెక్ ఉద్యోగులు
ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని తొలగించాయి. ఈ లేఆఫ్స్ ప్రభావం సంప్రదాయ రంగాలపై కూడా పడుతోంది. బ్రిటిష్ అమెరికన్ టొబాకో 5,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగులు అప్‌స్కిల్లింగ్ ద్వారానే ఈ సవాలును ఎదుర్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.