అన్నాడీఎంకే తమ రెండో విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో కీలక హామీలుగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, పెన్షన్లను రూ.2వేలకు పెంచుతామని పేర్కొంది. విద్యార్థులకు రుణమాఫీ చేస్తామని, జల్లికట్టు కమిటీలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. జల్లికట్టులో గాయపడ్డవారికి రూ.2 లక్షల పరిహారం, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించింది.