ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 'నమస్తే వరల్డ్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద విమాన టికెట్లపై 20 శాతం తగ్గింపు అందిస్తోంది. దేశీయంగా ప్రారంభ టికెట్ ధర రూ.1,499 కాగా, అంతర్జాతీయ రూట్‌లో రూ.5,033గా నిర్ణయించారు. ఈ ఆఫర్ ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల మధ్య నడిచే సర్వీసులకు వర్తిస్తుంది. ఫిబ్రవరి 4న ప్రకటించిన ఈ ఆఫర్ కింద, గురువారం అర్దరాత్రి లోపు బుకింగ్ చేసుకున్నవారు ఈ నెల 11 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. airindia.com, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి, అలాగే SBI క్రెడిట్ కార్డుతో బుకింగ్ చేసుకున్న వారికి అదనపు రాయితీలు కూడా ఉన్నాయి.