ఎయిరిండియా అంతర్జాతీయ విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ తగ్గింపు

14071చూసినవారు
ఎయిరిండియా అంతర్జాతీయ విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ తగ్గింపు
విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు తగ్గడంతో, అంతర్జాతీయ విమాన టికెట్లపై విధించిన ఇంధన సర్‌ఛార్జీని ఎయిరిండియా కొంతమేర తగ్గించింది. ముడిచమురు ధరలు పశ్చిమాసియా యుద్ధానికి ముందు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) దేశాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలు తగ్గుతున్నాయి. జులై 1 నుంచి అమెరికా-ఆస్ట్రేలియా విమానాల్లో సర్‌ఛార్జీని 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు, ఐరోపా-యూకే విమానాల్లో 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్