AP: త్వరలోనే కుప్పంలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నామని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు డిజిటల్ లిటరసీతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. కుప్పంలో 8,500 మంది మహిళలకు శిక్షణ అందుతోందన్నారు. కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని, రెండేళ్లలో పరిశ్రమలు, అనుబంధ కార్యక్రమాలతో యువతకు
ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు.