ఎయిర్‌టెల్ సరికొత్త అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

4273చూసినవారు
ఎయిర్‌టెల్ సరికొత్త అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్
భారత టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ మరో కీలక అడుగు వేసింది. రూ.399, రూ.449 ధరలతో రెండు కొత్త అన్‌లిమిటెడ్ 4G,5G ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 300GB వరకు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS అందిస్తాయి. రూ.399 ప్లాన్‌లో ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.449 ప్లాన్‌లో గూగుల్ వన్ 30GB క్లౌడ్ స్టోరేజ్, జియో హాట్ స్టార్, సోనీ లివ్, ఎక్స్‌ట్రీమ్ ద్వారా 20కి పైగా OTT ప్లాట్‌ఫార్మ్స్ యాక్సెస్, ఆపిల్ మ్యూజిక్ (6 నెలలు) వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. డేటా, OTT వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్లు రూపొందించబడ్డాయి. ప్రస్తుతం కొన్ని సర్కిల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్