5వ తరగతి పాఠ్య పుస్తకంలో ఐశ్వర్యరాయ్ పాట

23835చూసినవారు
5వ తరగతి పాఠ్య పుస్తకంలో ఐశ్వర్యరాయ్ పాట
ఒడిశాలో 5వ తరగతి పాఠ్యపుస్తకంలో బాలీవుడ్ చిత్రం హమ్ దిల్ దే చుకే సనమ్లోని ప్రసిద్ధ "నింబుడా నింబుడా" పాట సాహిత్యం ముద్రించబడటం వివాదాస్పదమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రింటింగ్ లోపం కారణంగానే ఈ తప్పు జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదే కాకుండా కొత్త పాఠ్యపుస్తకాల్లో సుమారు 1,600కు పైగా తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక అసెంబ్లీని ఒడిశా అసెంబ్లీగా, ఐజాక్ న్యూటన్‌ను పైలట్‌గా పేర్కొనడం వంటి పొరపాట్లు కూడా వెలుగుచూశాయి. ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్