అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ రాజ్యసభకు ఎంపిక?

4007చూసినవారు
అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ రాజ్యసభకు ఎంపిక?
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో, ఆ రాజ్యసభ స్థానాన్ని పార్థ్ భర్తీ చేయనున్నారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. పార్థ్ గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్