దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఇవాళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కేటాయించనున్నారు. అంతకుముందు సునేత్రను ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అటు అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి సునేత్ర పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తారు.