బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తన అత్తగారు డింపుల్ కపాడియాతో కలిసి బుధవారం తెల్లవారుజామున ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి, తన తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో పాటు దేశ ప్రజలందరి కోసం, కుటుంబం కోసం ప్రార్థనలు చేశానని, దేశం ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.