ALERT: వాయుగుండం ముప్పు.. భారీ వర్షాలు

205చూసినవారు
ALERT: వాయుగుండం ముప్పు.. భారీ వర్షాలు
AP: ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనంపై ఇంకొద్ది రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది. వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్